రాష్ట్రంలో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గ్రామాల నుంచి మొదలు పెడితే నగరాల వరకు కల్తీ కల్లు మాఫియా రెచ్చిపోతుంది. పొద్దంతా కూలీ, వ్యవసాయ పనులు చేసిన చాలా మంది రాత్రి కాగానే కల్లు తాగుతారు. ఇదే అదునుగా కొందరు కల్తీ కల్లు విక్రయాలు జరుపుతున్నారు. వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలంలో కల్లు లో తోకపురుగులు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేసారు. కల్లు తాగి అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాలి.
