జగిత్యాల జిల్లా, మెట్ పల్లి: మెట్ పల్లి పట్టణంలో మారుతి నగర్ శ్మశాన వాటిక అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. కనీస సౌకర్యాలు లేక అంత్యక్రియలకు ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఏళ్ల తరబడి పిచ్చి మొక్కలు, ముళ్ల చెట్లతో, చెత్తతో నిండిపోయి ఎవరైనా మరణిస్తే వెళ్లడానికి చాలా ఇబ్బందిగా ఉందని స్థానికులు చెప్తున్నారు. భారీ ఎత్తులో ఉన్న మొక్కలతో శ్మశాన వాటిక చిట్టడవిని తలపిస్తోంది. కనీసం విద్యుత్తు సరఫరాలేక, నాసిరకం నిర్మాణాలు, వెళ్లేందుకు సరైన మార్గం లేకుండా ఇష్టారాజ్యంగా నిర్మించారు. దీంతో చాలా చోట్ల అవి వినియోగించలేని పరిస్థితి నెలకొంది. చాలాచోట్ల బోర్లు వేసి ఉంచారు కానీ విద్యుత్తు సరఫరా లేకపోవడంతో బోరు నీటిని వాడలేని పరిస్థితి. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
