కరీంనగర్ జిల్లా: ప్రముఖ నటుడు శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్ బ్లూ జే మూవీస్ క్రియేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న
” ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా ” చిత్రం షూటింగ్ మూడు రోజుల క్రితం కరీంనగర్ లో ప్రారంభమైంది. నటుడు రాజేంద్రప్రసాద్, హీరో శ్రీకాంత్, లయ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి, నిర్మాత చందు వెంకటేష్ నేతృత్వంలో పది రోజులపాటు కరీంనగర్ పరిసరాల ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. హీరో హీరోయిన్లతో పాటు జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. దీపావళికి సినిమా విడుదల చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు చిత్ర నిర్మాత,దర్శకుడు తెలిపారు.
ఈ సందర్భంగా ఆదివారం నాడు హీరో శ్రీకాంత్ ” రిపోర్టర్ టీవీ” తో మాట్లాడుతూ కరీంనగర్ కు ఎన్నోసార్లు వచ్చాను… కానీ షూటింగ్ మాత్రం ఇదే మొదటిసారి అని అన్నారు. కరీంనగర్ లో సినిమా షూటింగ్ చేయడం సంతోషంగా ఉందని ఇక్కడి అధికారులు, పోలీసులు అన్ని విధాలుగా సహకారాలు అందిస్తున్నారని అన్నారు.