మెదక్ జిల్లా – తూప్రాన్ డివిజన్ – చిన్నశంకరంపేట : సోమవారం చిన్న శంకరంపేట మండల వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయాన్ని సోమవారం దివ్యాంగులు, వృద్యాప, వితంతు, బీడీ, చేనేత కార్మికులు ముట్టడించారు. రెండు గంటల పాటు కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాలు, వికలాంగుల అనుబంధ సంఘాలు, పెద్ద ఎత్తున చేరుకొన్నారు. ప్రభుత్వం పెన్షన్లు పెంచుతామని చెప్పినప్పటికీ 20 నెలలు గడిచినప్పటికీ పెన్షన్లు పెంచక పోవడంతో పాటు, కొత్త పెన్షన్లు ఇవ్వకుండా ద్వంద వైఖరి నిర్లక్ష్యం వయిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు మురళి మాదిగ మాట్లా డుతూ, వికలాంగుల పెన్షన్ ను రూ. 6000 పెంచాలని, వృద్ధులు వితంతులు ఉంటది మహిళలు చేనేత గీత బీడీ కార్మికులతో పాటు ఇతర పెన్షన్ దారుల పెన్షన్లను రూ. 4 వేలకు పెంచాలని, కండరాల క్షణిత కలిగిన వారికి రూ. 15000 ఇవ్వాలని, అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో జిల్లా అధ్యక్షుడు బాచుపల్లి పాండు, భూమయ్య, చిప్ప కృష్ణ, మండల అధ్యక్షుడు రెడ్డి గోపాల్, రాజు, తోపాటు నాయకులు పాల్గొన్నారు. అనంతరం తాసిల్దార్ కు వినతిపత్రం అందించారు.
