జగిత్యాల జిల్లా- మెట్ పల్లి పట్టణంలోని వేంపేట్ రోడ్డులో డిపో సర్కిల్ వద్ద ఇరువురు వ్యక్తిల మధ్య జరిగిన గొడవ కత్తిపోట్లకు దారితీసింది వివరాల్లోకి వెళితే మెట్ పల్లి పట్టణానికి చెందిన ఏనుగందుల గణేష్ (24) సం అనే అతను జగిత్యాల పట్టణానికి చెందిన మిరియాల్ కార్ రాజేశ్వర్ వద్ద పనిచేసే వాడని తనకు రావాల్సిన జీతం బకాయి 5 వేల రూపాయలను ఇవ్వాలని ఫోన్ చేసి అడగగా కోపోద్రికుడైన మిరియాల్ కార్ రాజేశ్వర్ తన స్నేహితులు నిఖిల్, విష్ణు, ముగ్గురు జగిత్యాల నుండి మెట్ పల్లి వచ్చి బేకరీ వద్ద స్నేహితులతో ఉన్న సమయంలో కత్తితో దాడి చేశారు, ఎనుగందుల గణేష్ కు తీవ్ర గాయాలు కావడంతో హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కొరకు నిజామాబాద్ మనోరమ హాస్పిటల్ కు తరలించారు గణేష్ తండ్రి సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు మెట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
