తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ కి ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండాను ఎగరవేశారు.
ఈ సందర్భంగా బిసి కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలినమైన సందర్భంగా ప్రజా పాలన దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 17, 1948 సంవత్సరంలో తెలంగాణ నిజాం చెర నుండి విముక్తి పొంది, భారత దేశంలో విలీనమైన ఎంతో ప్రాముఖ్యత గల సెప్టెంబరు 17వ తేదీని ‘తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం’ గా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. రజాకార్లకు వ్యతిరేకంగా, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వీరయోధులను అందరం స్మరించుకువాలని చూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అదనపు కలెక్టర్లు బిఎస్ లతా రాజా గౌడ్ ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.