తిరుపతి: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నందు బహుజన ఎంప్లాయిస్ ఫెడరేషన్ నూతన కార్యవర్గాన్ని గురువారం ప్రకటించారు. చీఫ్ కోఆర్డినేటర్ గా పుణ్యమూర్తి చింతమాకుల పాల్గొని ప్రకటించారు. ఈ సమావేశం నందు ప్రొఫెసర్లు పిసి వెంకటేశ్వర్లు, డాక్టర్ బాలాజీ, దమ్లా నాయక్, మహమ్మద్ షఫీ, గోవిందు మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ సునీత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు బహుజన వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన వారి అనుభవంలో ఎలా పోరాటం చేశారో తెలిపారు. బహుజన ఉద్యోగస్తులందరూ ఐక్యమత్యంగా ఉండి రాజ్యాంగ హక్కులను పొందాలని అందుకు సంఘటితం అవ్వాలని పునరుద్యోగించారు. అతిథులందరూ కూడా వారి వారి అనుభవాలను పంచుకోవడం జరిగింది. అనంతరం కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యంగా గౌరవ అధ్యక్షులుగా ప్రొఫెసర్ పీసీ వెంకటేశ్వర్లు మరియు డాక్టర్ బాలాజీ నీ ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా సంగీతం సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శిగా పద్మనాభం, సంయుక్త కార్యదర్శి దార్ల రఘురాములు, ఇతర టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగస్తులు కార్యవర్గంలోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు దశా దిశా నిర్దేశాన్ని నూతన కార్యవర్గానికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన టీచింగ్, నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ పాల్గొన్నారు.
