కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో శుక్రవారం మానేరు బ్రిడ్జి సాధన సమితి ఆధ్వర్యంలో మానేరు వంతెన కోసం 77 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మరియు మానకొండూరు నియోజవర్గం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు బ్రిడ్జి సాధన సమితి అధ్యక్షులు పుల్లెల జగన్మోహన్,బీజేపీ నాయకులు పుల్లెల రాము గ్రామ ప్రజలతో కలిసి పాలాభిషేకం చేశారు.
అనంతరం గన్నేరువరం మండలానికి బ్రిడ్జి నిర్మాణం కోసం తమ వంతుగా కృషిచేసిన గన్నేరువరం మండల పాత్రికేయులు బుర్ర రాజకోటి గౌడ్ ( రిపోర్టర్ టీవీ), తేళ్ల రవీందర్, బుర్ర అంజయ్య గౌడ్, తుమ్మ సతీష్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇనకొండ లక్ష్మణ్, సీపీఐ జిల్లా కౌన్సిల్ మెంబర్ కాంతాల అంజిరెడ్డి, బీజేపీ నాయకులు జీల కుమార్ యాదవ్,యాస్వాడా సోమిరెడ్డి రాజిరెడ్డి, ఘర్షకుర్తి బాలయ్య, మునగంటి అంజి,రాజయ్య, గ్రామ ప్రజలు, వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు.










