కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని చొక్కారావుపల్లి బిక్కు వాగు నుండి ట్రాక్టర్ల ద్వారా, మారెళ్ళకుంట వద్ద ఇసుకను డంపు చేసుకొని, అక్కడినుండి బొలోరో వాహనం ద్వారా అక్రమంగా సిద్దిపేటకి ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు గన్నేరువరం ఎస్సై నరేందర్ రెడ్డి వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మిరుదొడ్డి శివకుమార్ అనే వ్యక్తి ఇసుకతో ఉన్న బొలెరో పోలీస్ వారు అదుపులోకి తీసుకొని విచారించగా … పలు విషయాలు బహిర్గతమయ్యాయి. ఇద్దరు వ్యక్తుల పై కేసు నమోదు చేసి కారు మరియు బొలోరో వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్సై నరేందర్ రెడ్డి తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
