కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం చాకలివానిపల్లి, ఖాసీంపేట్, పారువెళ్ల గ్రామాల్లో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు వీహెచ్పీఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో వికలాంగుల పెన్షన్ 4000 నుండి 6000వేలు,చేయూత పెన్షన్ దార్ల పెన్షన్ 2000 నుండి 4000వేలు, కండరాల క్షీణిత పూర్తి వైకల్యం కలిగిన వారికి 15000 వేల రూపాయలు పెంచాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి రేపాక బాబు మాదిగ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం 21 నెలలు గడుస్తున్న పెన్షన్ దార్ల సమస్యలు పరిష్కరించడంలో మరియు వారికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమై జరిగిందని అన్నారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులకి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. ఈకార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కళ్ళేపెల్లి సురేష్ మాదిగ,సీనియర్ నాయకులు కళ్ళేపెల్లి కొమురయ్య మాదిగ, గోపాల్ రెడ్డి, ముత్యం రెడ్డి, బొజ్జ భూమయ్య,సందనవేణి పర్శరాములు,బత్తుల రాయమల్లు, కళ్ళేపెల్లి భూమయ్య, వృద్దులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు
