కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం చొక్కారావుపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులందరూ పూలను పేరుస్తూ బతుకమ్మ పాటలను పాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రజినీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ పండుగ శుభప్రదమైన ప్రారంభాలను చేకూర్చాలని,ఇది చెడుపై మంచి విజయాన్ని,ధర్మం, సత్యం మరియు న్యాయం యొక్క విజయాన్ని సూచిస్తుంది ప్రజలు తమ సొంత బలహీనతలను అధిగమించడానికి ప్రోత్సహిస్తుంది అని తెలిపారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు నరేష్ కుమార్, అంగన్వాడి టీచర్ శారద, విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు
