contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

శాతవాహన లో ఎస్టీ బాలుర, బాలికల వసతి గృహాల శంకుస్థాపన

● విశ్వవిద్యాలయాలు నాణ్యమైన విద్యను అందించాలి..

● మౌలిక సదుపాయాల కల్పనకు ఈ ప్రభుత్వం ముందుంటుంది..

● ప్రజా పాలన అంటే ప్రజల వద్దకు పాలన

● విద్యా ఆరోగ్య రంగాలు రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్ళు

కరీంనగర్ జిల్లా: శాతవాహన విశ్వవిద్యాలయం బాలికల హాస్టల్ ప్రాంగణంలో ఆదివాసి బిడ్డల కొరకు బాలుర, బాలికల (ఎస్టీ) హాస్టల్స్ కొరకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన వసతి గృహాలను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ నూతన హాస్టల్ భవన నిర్మాణం కొరకు శంకుస్థాపన చేయడం జరిగింది.

ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ పేద, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు హాస్టల్ వసతి కావాలని రాష్ట్రం తీసుకున్న నిర్ణయం చాలా అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వం పేద బిడ్డల కొరకు ఆదివాసి, గిరిజన బిడ్డల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తుందని దానిలో భాగంగా 20 కోట్ల విలువైన రెండు హాస్టల్ భవనాలను చెరొక పదికోట్లతో నిర్మించడానికి ఆర్థిక సహాయం చేసిందని దీనితో విశ్వవిద్యాలయాలలో ఆదివాసీ, గిరిజన బిడ్డలకు హాస్టల్ సౌకర్యాలు సమకూరుతాయని ఉన్నత విద్యను నేర్చుకోవడం కొరకు విద్యార్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజా పాలన నాయకత్వంలో ఎన్నో మంచి మార్పులు వచ్చాయని దాన్లో భాగంగా హుస్నాబాద్ లొ ఇంజనీరింగ్ కళాశాల, కరీంనగర్ లో ఎల్.ఎల్.బి, ఎల్ఎల్ఎం, ఫార్మసీ కోర్సులు తీసుకురావడం చాలా అభినందదాయకమని ఈ జిల్లాకు విద్య, వైద్య సౌకర్యాలకై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని కాంగ్రెస్ హయాంలో ఎన్నో అభివృద్ధి కరమైన పనులు జరిగాయని ప్రజల ఆకాంక్ష కోసము విద్య సంక్షేమ కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోవటానికి రాష్ట్ర ఖజానాలొ సరిపోయే డబ్బులు లేనప్పటికీ మంత్రిమండలి సమిష్టిగా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు.
అంతేకాకుండా విశ్వవిద్యాలయము కూడా యుజిసి గ్రేడింగ్, నాక్, ఏ ఐ సి టి ఈ మార్గదర్శకాలను అనుసరించి నాణ్యమైన విద్యను అందించడానికి అధ్యాపకులు కష్టపడాలని విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి తోడ్పడాలని కోరుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారము విద్యను ముందుకు తీసుకెళ్లాలని గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో తమ పిల్లల్ని విశ్వవిద్యాలయాలకు పంపుతున్నారని వారి ఆశలను సజీవంగా నిలిపి దేశ విదేశాలలో శాతవాహన పేరు విద్యా ప్రమాణాలు విషయంలో ప్రధమంగా నిలిచేందుకు ప్రయత్నం చేయాలని ఆశిస్తున్నామన్నారు.
భవిష్యత్తు తెలంగాణను అభివృద్ధి దిశలో తీసుకెళ్లి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.

విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సౌకర్యాల పట్ల మౌలిక నిర్మాణాల పట్ల చాలా చొరవ చూపిస్తుందని ప్రభుత్వ ఆదేశాల మేరకు తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా పాలకవర్గ సహకారంతో నాణ్యమైన విద్యను అందించడానికి విశ్వవిద్యాలయాన్ని అన్ని రంగాలలో ముందు నిలిపి లక్ష్యసాధన కొరకు కృషి చేస్తామన్నారు.

జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేల సత్పతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నో ఉపాధి అవకాశాలను ప్రజల కొరకు ఏర్పాటు చేస్తుందని, నాణ్యమైన ఉన్నత విద్యతోనే విద్యార్థులు మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటారని విశ్వవిద్యాలయాలలో మౌలిక సదుపాయాలు సరిగ్గా ఉంటేనే నాణ్యమైన విద్య కూడా విద్యార్థులకు అందుతుందని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పేదవారికి మంచి విద్య అందించేందుకు నడుము కట్టిందని విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, జిల్లా అధికారులు, ఆర్ టి ఐ అధికారి, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ర్ ఆచార్య జాస్తి రవికుమార్, ఓ ఎస్ డి టు విసి డాక్టర్ బి హరి కాంత్, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ రమాకాంత్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సుజాత, విశ్వవిద్యాలయ చీఫ్ వార్డెన్ డాక్టర్ మనోహర్ వివిధ విభాగాల అధిపతులు అధ్యాపకులు బోధనీతర సిబ్బంది విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :