అనంతపురం జిల్లా గుత్తి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో స్థానిక పట్టణంలోని జంగాల కాలనీ 1 మరియు 2 అంగన్వాడి కేంద్రాల వద్ద ఏర్పాటుచేసిన 8వ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమం పురస్కరించుకొని ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ నాగమణి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యవివాహాలు కు సహకరిస్తే ఇంటి పెద్దలు, గ్రామ పెద్దలు, చివరకు వివాహాలు జరిపించే మత పెద్దలు శిక్షార్పుల అవుతారని హెచ్చరించారు. కిషోర బాలికలకు తగిన వయసు వచ్చిన తర్వాతనే వివాహాలు జరిపించాలని ఆమె తెలిపారు. అందుబాటులో ఉన్న అంగన్వాడి కేంద్రాల ద్వారా ఇచ్చే పోషక పదార్థాలు గర్భవతులు, బాలింతలు, చిన్నారులు తీసుకొని ఆరోగ్యవంతమైన, ఆనంద జీవితాన్ని గడపాలన్నారు. తదన అనంతరం గర్భవతులకు శ్రీమంతాలు, ఆరు నెలలు నిండిన చిన్నారులకు అన్నప్రాసన తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, వైద్యురాలు ఆయుష్ అంజుమ్, సూపర్వైజర్ రాజేశ్వరి, ఏఎన్ఎం భార్గవి, ఎమ్మెస్ కే భారతి, ఆశా కార్యకర్తలు రాధ, అనంతమ్మ అంగన్వాడి టీచర్లు ఉమామహేశ్వరి, శోభారాణి, నాగరత్న సహాయకులు రజియా, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
