అనంతపురం జిల్లా నూతన కలెక్టర్ గా విధులు చేపట్టిన ఓ.ఆనంద్ ను మంగళవారము గుంతకల్లు పట్టణానికి చెందిన బిజెపి మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మరియు ఆంధ్రప్రదేశ్ ఎఫ్ సి ఐ డైరెక్టర్ వనగుంది విజయలక్ష్మి మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చములు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్ సి ఐ గోడౌన్లలో విధులు నిర్వహిస్తున్న హమాలీలకు గత నాలుగు మాసాలుగా దిగుమతి చార్జీలు చెల్లించలేదని, దసరా వేడుక సందర్భంగా బోనస్ చార్జీలు 6500 రూపాయలు, ఒక హమాలీకు స్వీట్ బాక్స్ చార్జీలు 1500 రూపాయలు, హమాలీల యూనిఫామ్ తో పాటు కుట్టు కూలీలు కూడా అందలేదు. తక్షణమే చార్జీలు చెల్లించి మరియు హమాలీల సాధారణ సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో వరప్రసాద్, హుస్సేన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
