అనంతపురం జిల్లాగుత్తి మండలంలోని ఊబిచర్ల గ్రామంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన వేరుశనగ పంటను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తడిసిపోయిన పంటలను పరిశీలించడం జరిగింది . ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు వి. నిర్మల మాట్లాడుతూ గుత్తి మండలంలోని ఊబిచర్ల గ్రామంలో తడిసిన పంటలను పరిశీలించడం జరిగిందన్నారు గత 20 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా తేమ ఎక్కువై బూడిద తెవ్వులు వచ్చి పండిన పంట మొత్తం జలమయము అయిందన్నారు. పండిన వేరుశనగ పంటలు వర్షానికి తడిచిపోయి వేరుశనక్కాయలు నల్లగా బూజుపట్టాయన్నారు తడిసిన పంటను ప్రభుత్వమే ఎనిమిది వేల రూపాయలు క్వింటా ధరతో కొనుగోలు చేయాలన్నారు. గ్రామంలో సుమారుగా 200 ఎకరాలు పైగా చేతికొచ్చిన పంట నీటిలో మునిగి నేలపాలు అయిందన్నారు. ఎకరాకు లక్ష రూపాయలు పైగా పెట్టుబడులు పెట్టి విత్తనాలు మందులు కలుపులు కూలీల ఖర్చులతో లక్ష రూపాయల పైగా ఎకరాకు పెట్టుబడి వచ్చిందని రైతులు తెలియజేశారన్నారు. తక్షణమే ప్రభుత్వం రెవెన్యూ అధికారులు గ్రామాలలోని నష్టపోయిన పంటలను పరిశీలించి నష్టపరిహారం అంచనా వేసి ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ తోపాటు ఎకరాకు 50 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పశువులకు మేత కూడా లేకుండా మొత్తం నానిపోయి కుళ్ళిపోయిందన్నారు. కావున తక్షణం ప్రభుత్వమే స్పందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రామకృష్ణ, మల్లేష్, మల్లికార్జున, గంగాధర, అశోక్, రేణుక, రేవతి తదితరులు పాల్గొన్నారు
