వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కండ్లపల్లి గేటు సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడిన ఘటన చోటుచేసుకుంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, సిమెంట్ ట్యాంకర్ మరియు ఎస్ క్రాస్ కారు ఎదురెదురుగా ఢీకొనడంతో చేవెళ్ల మండలం మిర్జాగూడ గ్రామానికి చెందిన ఇబ్రహీంపల్లి మల్లేశం తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతన్ని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద స్థలానికి చేరుకున్న చంగముల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ భరత్ కుమార్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.