పార్వతీపురం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి గ్రామంలో స్కూల్ లేని పరిస్థితి విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోంది. గ్రామంలో ప్రాథమిక పాఠశాల భవనం లేక పిల్లలు చదువులకు దూరమవుతున్నారు. చిన్న పిల్లలు ప్రాథమిక విద్య కోసం ఎదురుచూస్తున్నా, ఇప్పటివరకు అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోలేదని గ్రామస్తులు ఈరోజు ఆందోళన చేపట్టారు. గతం లో జిల్లా కలెక్టర్ ఆ గ్రామాన్ని సందర్శించినప్పటికీ ఫలితం లేదు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి గ్రామానికి కనీస ప్రాథమిక విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ అధికారుల అలసత్వం వల్ల పిల్లల జీవితాలపై ప్రభావం పడుతోంది. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
