వికారాబాద్ జిల్లా, పరిగి నియోజకవర్గం: భారతదేశ న్యాయవ్యవస్థ చరిత్రలో చీకటి అధ్యాయంగా నిలిచే సంఘటనపై పరిగి నియోజకవర్గంలోని వివిధ ప్రజాసంఘాల నాయకులు ఘాటుగా స్పందించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి పై కోర్టు ప్రాంగణంలోనే జరిగిన దాడిని వారు తీవ్రంగా ఖండించారు. వారు మాట్లాడుతూ ప్రధాన న్యాయమూర్తి పై దాడి సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందని, ఇది న్యాయవ్యవస్థకు మాయని మచ్చని, దేశ ప్రజల నమ్మకానికి ప్రతీకగా ఉన్న న్యాయ వ్యవస్థపై జరిగిన దాడి గ భావిస్తూ హేయమైన చర్యకు పాలుపడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రంలో సురేందర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మంచన్పల్లి ఆనంద్, రామకృష్ణ సిపిఎం, దేవనగూడ వెంకటన్న, ప్రజా సంఘాలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.