కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలో ఇటీవల వర్షాలకు సాంబయ్య పల్లె గ్రామంలో జీల తిరుపతి యాదవ్ వరి పంట పూర్తిగా దెబ్బతిని నేలకు రాలింది. దీంతో రైతులు వరి పంట పొలాలు, పత్తి, మొక్కజొన్న భారీగా నష్టం కావడంతో రైతులు లబోదిబో అంటున్నారు.. వ్యవసాయ అధికారులు మాత్రం ఇప్పటివరకు పంట పొలాలను పరిశీలించలేదు. రైతు తిరుపతి పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో అదనంగా బీహార్ కూలీలను తీసుకొచ్చి నేలకొరిగిన వరి పంటలను కాపాడుకుంటున్నాడు..
తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్లెల జగన్మోహన్ బుధవారం పంట పొలాలను పరిశీలించి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, మండల శాఖ అధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి పదివేల రూ. చొప్పున ప్రభుత్వం అందజేయాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో కొట్టే భూమయ్య,గడ్డం కర్ణకర్ రెడ్డి, జీల కుమార్ యాదవ్, గడ్డం మల్లారెడ్డి పాల్గొన్నారు.