తిరుపతి: శ్రీలక్ష్మీశ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను కొత్త ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అయినా పట్టించుకోని కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తారని కార్పొరేషన్ ఉద్యోగులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
గతంలో 2024 సంవత్సరంలో టీటీడీ ఎస్.ఎల్.ఎస్.యమ్.పి.సి లో పనిచేస్తున్న ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఈ.హెచ్.ఎస్ ఉన్నవాళ్లకి కార్పొరేషన్ ద్వారా టిటిడి మరియు అనుబంధ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ క్రింది టిటిడి ఆసుపత్రులలో ఆరోగ్య పథకాన్ని అమలు చేసింది.
1. సెంట్రల్ హాస్పిటల్, తిరుపతి.
2. స్విమ్స్ హాస్పిటల్, తిరుపతి.
3. బిఐఆర్ఆర్డి హాస్పిటల్, తిరుపతి.
4. ఎస్.వి. ఆయుర్వేద ఆసుపత్రి, తిరుపతి.
5. ఎస్.పి.సి.హెచ్.సి హాస్పిటల్, తిరుపతి.
6. అశ్విని హాస్పిటల్, తిరుమల.
కార్పొరేషన్ ఉద్యోగికి మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వైద్యం అందించడం కోసం రూ.3 లక్షల 20 వేల రూపాయల వరకు ఒక సంవత్సరంలో వైద్యం చూపించుకోవచ్చు. శ్రీలక్ష్మీశ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రస్తుతము సిమ్స్, బర్డ్, ప్రాణదానం, ఆయుర్వేద హాస్పిటల్, అశ్విని హాస్పిటల్ తిరుమలలో వైద్యం అందిస్తారు.
కానీ సెంట్రల్ హాస్పిటల్ లో చూడడం లేదని కనీసం మెడిసిన్ కూడా ఇవ్వడం లేదని కార్పొరేషన్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. 2024 సంవత్సరంలో టీటీడీ ప్రొసీడింగ్ ఆర్డర్స్ లో ఫస్ట్ సెంట్రల్ హాస్పిటల్ పేరే ఉందని, దినికి సంబంధించి ఆడర్ కూడా ఇచ్చి ఉన్నారని, అయితే గత సంవత్సర కాలం నుంచి ఇంత వరకు జీఎస్ఎం నెంబర్లను సెంట్రల్ హాస్పిటల్ లో అప్లోడ్ చేయలేదని, ఈ సమస్యలన్నీ ప్రస్తుతం ఉన్న ఈవో అయినా పట్టించుకోని కార్పొరేషన్ ఉద్యోగులకు సెంట్రల్ హాస్పిటల్ లో వైద్యం అందించే విధంగా చూడాలని కార్పొరేషన్ ఉద్యోగులు కోరుతున్నారు.