తిరుపతి: ఇండియన్ రైల్వే ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఐ.ఆర్.ఇ.ఎప్) 4వ వార్షికోత్సవ సమావేశం సెప్టెంబర్ 21,22 తేదీల్లో వారణాసిలో జరిగింది. ఈ సమావేశానికి పార్లమెంట్ సభ్యులు కామ్రేడ్ సుధామ ప్రసాద్ రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎ.ఐ.సి.సి.టి.యు అఖిలభారత అధ్యక్షులు కామ్రేడ్ శంకర్, అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రాజీవ్ డిమ్రి హాజరై రైల్వే కార్మికులకు తమ సందేశాన్ని ఇచ్చారు. ఈ సమావేశంలో రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద చర్చించడం జరిగింది. ప్రధానంగా, యూనిఫైడ్ పెన్షన్ స్కీం(యు.పి.ఎస్) వెంటనే వెనక్కి తీసుకొని ఓల్డ్ పెన్షన్(ఓ.పి.ఎస్) విధానాన్ని అమలుపర్చాలని, ఎనిమిదవ వేతన సంఘము త్వరితగతిన రిపోర్టులు తీసుకొని కార్మికుల సమస్య లైన జీతభత్యాలను పెంచాలని, రైల్వేలో ప్రైవేటీకరణను అవుట్సోర్సింగ్ లను తక్షణమే ఉపసంహరించుకోవాలని సమావేశం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అనంతరం ఇండియన్ రైల్వే ఎంప్లాయిస్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నేషనల్ ప్రెసిడెంట్ అఖిలేష్ కుమార్ పాండే, నేషనల్ జనరల్ సెక్రటరీ సర్వజిత్ సింగ్, ఎన్నికయ్యారు. సౌత్ ఇండియా ప్రతినిధులుగా ఎస్ మీరయ్య జాతీయ ఉపాధ్యక్షులు, సహాయ ప్రధాన కార్యదర్శిగా కె.యోహన్, సహాయ ప్రధాన కార్యదర్శి గా కే.హేమంత్ కుమార్ ఎన్నికయ్యారు. నవంబర్ 25వ తారీఖున జరిగే పాత పెన్షన్స్ స్కీం సాధన కొరకు జరిగే కార్యక్రమంలో ఢిల్లీకి కార్మికులంతా తరలి రావాలని నూతన కమిటీ కోరింది. తిరుపతికి చెందిన ఎస్ మీరయ్య ఇండియన్ రైల్వే ఎంప్లాయిస్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులు గా ఎన్నికైన సందర్భంగా తిరుపతి జిల్లా ఆర్టీసీ ఎంప్లాయిస్ రీజనల్ సెక్రెటరీ ఏం మైకేల్ మరియు పలువురు ఎంప్లాయిస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
