అనంతపురం జిల్లా :అనంతపురం జిల్లా గుత్తి మండలం జక్కలచెరువు గ్రామ శివారులో కొనసాగుతున్న పేకాట శిబిరంపై పోలీసులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. అర్బన్ సీఐ రామారావు, ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో పోలీసు బృందం ఈ దాడులు చేపట్టింది.
పోలీసుల తనిఖీల్లో పేకాట ఆడుతున్న పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.18,200 నగదు, పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
సమాజాన్ని భ్రష్టుపట్టించే పేకాట లాంటి అక్రమాలకు తావు ఇవ్వబోమని పోలీసులు హెచ్చరించారు. గ్రామాల్లో ఈ తరహా కార్యకలాపాలను చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు.