పాకాల, తిరుపతి జిల్లా: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పాకాల మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పాకాల సర్కిల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పేర్కొన్న విషయాల ప్రకారం, మండల పరిధిలో ఎవరైనా భానా సంచా (పటాకులు) ను జనావాస ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ చేస్తే గాని, రవాణా చేస్తే గాని, వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇంకా ఆయన తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి:
ప్రజా రవాణా వాహనాలు, ట్రైన్లు వంటి మాధ్యమాల్లో భానా సంచా తరలించడం నిషిద్ధం.
హోల్సేల్ వ్యాపారులు ముందుగా సంబంధిత అధికారుల అనుమతులు పొందాలని ఆయన కోరారు.
జనావాసాలకు దూరంగా, సురక్షితమైన ప్రాంతాల్లో మాత్రమే నిల్వ చేయాలని సూచించారు.
అధికారులు నిర్దేశించిన ప్రదేశాలలోనే నిబంధనల మేరకు అమ్మకాలు జరగాలని స్పష్టం చేశారు.
సెల్ఫ్ సేఫ్టీతో పాటు సమాజ భద్రత కూడా ముఖ్యమని, దీపావళి వేడుకలు శాంతియుతంగా జరగాలన్నదే తన అభిలాష అని ఇన్స్పెక్టర్ సుదర్శన్ ప్రసాద్ తెలిపారు. భద్రతా నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం తప్పదన్నారు.