కరీంనగర్ జిల్లా: గంగాధర మండలంలోని మధురానగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్ పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ అధికారులతో దాడులు నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటున్నట్టు ఫిర్యాదు రావడంతో ఏసీబీ బృందం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మధురానగర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఇందిరమ్మ ఇంటి బిల్లు కోసం గ్రామ కార్యదర్శి నెల రోజుల నుంచి డబ్బులు కోసం రూ.10,000 డిమాండ్ చేశారు. కార్యదర్శి డిమాండ్ మేరకు బాధితుడు 10,000 రూపాయలు ఇవ్వగా ఏసీబీ అధికారులు ప్రణాళికతో కార్యదర్శి లంచం స్వీకరిస్తున్న సమయంలో పట్టుకున్నారు.
కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ పంచాయతీ కార్యదర్శి అనిల్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లంచం తీసుకున్న మొత్తం, సంబంధిత పత్రాలు, రికార్డులు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు పంపిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, దీపావళి పండుగ సందర్భంగా టపాసుల దుకాణాల పర్మిషన్ విషయంలో గాని, ఇతర గవర్నమెంట్ అధికారులు లంచం అడిగినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేయాల్సిందిగా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు.