అనంతపురం జిల్లా గుత్తి పట్టణ టిడిపి కార్యాలయం నందు కార్యకర్తలతో ముఖ్యమైన సమావేశం నిర్వహిo చారు. ఈ సందర్భంగా గుత్తి టిడిపి బాధ్యుడు గుమ్మనూరు ఈశ్వర్ మాట్లాడుతూ నారా చంద్రబాబునాయుడు మనకు ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసాము. అలాగే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమాన్ని కూడా ప్రజల్లో తిరిగి కచ్చితంగా విజయవంతం చేసి, మరొక్కసారి మన నియోజకవర్గం సత్తా ఏంటో మళ్లీ చూపించాలని నాయకులకు కార్యకర్తలకు సూచించారు, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి, ప్రతి ఒక్కరూ కలసి కట్టుగా కష్టపడి పనిచేసి టిడిపి జెండా ఎగురవేద్దామని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఎవరైతే పార్టీకి కష్టపడి పని చేశారో వారిని గుర్తించి రాబోయే స్థానిక ఎన్నికలలో అవకాశం కల్పిస్తామని దగ్గరుండి పార్టీ కొరకు పని చేసిన వారిని గుర్తించి సీటు ఇచ్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటానని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గుత్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జక్కల చెరువు ప్రతాప్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ చికెన్ శ్రీనివాసులు, గోపాల్, సరోజమ్మ తదితరులు పాల్గొన్నారు
