కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్ నగర్ పట్టణ కేంద్రంలోని రన్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ “సంఘటన్ శ్రీజన్ అభియాన్” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అబ్జర్వర్ నరేష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సిర్పూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నరు.ఈసందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ కమిటీలను మరింత సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా తీర్చిదిద్దడం, కార్యకర్తలతో సమన్వయం పెంచడం, పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడమే
సంఘటన్ శ్రీజన్ అభియాన్ ప్రధాన ఉద్దేశమని అన్నారు.
ఏఐసిసి ఆర్గనైజర్ మాట్లాడుతూ ..
రాహుల్ గాంధీ ఆలోచనలు ఏఈసిసి ఆదేశానుసారం జిల్లా అధ్యక్షులు ఎంపిక మరియు పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరితో ఎఇసిసి అబ్జర్వర్ అందరి అభిప్రాయాలు తీసుకొని.పార్టీ ఆలోచనలను గ్రామ స్థాయి వరకు తీసుకో వెళ్లేందుకు మహిళలకు మరింత అవకాశాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశలను నెర వేర్చగాల ఏకైక శక్తి ఉందని పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో ఆర్గనైజర్లు పులి అనిల్ కుమార్,అధువల జ్యోతి,బత్తిని శ్రీనివాస్ గౌడ్,ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వ ప్రసాద్,మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు,టీపిసిసి ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ,మరియు తాజా మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.