పార్వతీపురం : పార్వతీపురం మన్యం జిల్లా,ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్.)లో తమ అర్జీల వివరాలను ‘మీ కోసం’ (Meekosam) వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, అర్జీదారులు నేరుగా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో తమ వినతులను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్జీల నమోదు ప్రక్రియ, నమోదైన అర్జీల స్థితి (స్టేటస్) మరియు దానికి సంబంధించిన ఇతర సమాచారం తెలుసుకోవడానికి 1100 (డబల్ వన్ డబల్ జీరో) టోల్ ఫ్రీ నంబరుకు నేరుగా ఫోన్ చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం వినతులను స్వీకరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా ప్రతి రోజూ ప్రజల నుంచి వినతులు స్వీకరించడానికి సెల్లార్‌లో ప్రత్యేకంగా ఒక సెల్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు.
