హైదరాబాద్.. సచివాలయంలో కార్మిక శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ మరియు లేబర్ కమిషనర్ శ్రీ దాన కిషోర్ కు వినతి పత్రం అందజేసిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిర్పూర్ పేపర్ మిల్లు పరిశ్రమలో వెంటనే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని, చాలా కాలంగా ఎన్నికలు జరగక పోవడంతో కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని కార్మికులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. సానుకూలంగా స్పందించిన ప్రిన్సిపాల్ సెక్రటరీ తగు ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారాని తెలిపారు.
