జగిత్యాల జిల్లా – కోరుట్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ లో బాగంగా జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్ ఆదేశాలమేరకు కోరుట్ల సర్కిల్ పోలీసుల ఆద్వర్యం లో ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వారి సహకారం లతో కోరుట్ల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మెట్ పల్లి డిఎస్పి అడ్లూరి రాములు ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు స్థానిక యువత, వ్యాపారస్తులు స్వచ్చందంగా రక్తదానం చేశారు. రక్తదాన చేసిన వారికి డిఎస్పి అడ్లూరి రాములు చేతుల మీదుగా పండ్లను అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా డిఎస్పి అడ్లూరి రాములు మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరులను స్మరిస్తూ రక్త దానం చేసేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చిన అందరికీ అభినందనలు తెలియజేశారు. శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణ త్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులను స్మరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం ద్వారా తాజాగా శరీరంలోకి కొత్త రక్తం ఉత్పత్తి అయ్యి ఆరోగ్యంగా ఉంటామని సూచించారు. కావున ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడడటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ రక్తదాన శిబిరాలలో సుమారు 100 యూనిట్ల రక్తాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వారికి అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు ,సబ్ ఇన్స్పెక్టర్ లు చిరంజీవి ,శ్రీధర్ రెడ్డి , జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ మంచాల కృష్ణ, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్ ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.










