అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని జెడ్ వీరా రెడ్డి కాలనీలో మంగళవారం తెలుగుదేశం పార్టీ గుత్తి ఇన్చార్జ్ ఈశ్వర్ విస్తృత పర్యటన చేశారు.. ఈ సందర్భంగా కాలనీవాసులు కాలనీ నందు ప్రధాన సమస్యలు రోడ్లు, మురికి కాలువలు, విద్యుత్ సమస్య మొదలగునవి చాలా ఉన్నాయని వాటిని పరిష్కరించాలని విన్నవించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలనీ నందు రోడ్డు సమస్యలు విద్యుత్ సమస్యలు చాలా ఉన్నాయని తమ దృష్టికి వచ్చిందని అందుకే స్వయంగా మీ కష్టాలు తెలుసుకోవడానికి ఈరోజు మీ కాలనీకి రావడం జరిగిందని కచ్చితంగా వీలైనంత త్వరగా రోడ్డు సమస్య విద్యుత్ సమస్యను కచ్చితంగా తీరుస్తానని స్థానికులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ టిడిపి నాయకులు చికెన్ సీనా, బండల ప్రసాద్, ఈశ్వరయ్య, పత్రాల రామకృష్ణ మరియు మండల కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










