అనంతపురం జిల్లా గుత్తి వెలుగు కార్యాలయంలో అక్షర ఆంధ్ర కార్యక్రమం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వయోజన విద్యా వాలంటీర్లకు శిక్షణ తరగతులు మునిసిపల్ కమీషనర్ బి.జబ్బార్ మియా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ – DRDA, మరియు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ – MEPMAA వారి సహకారంతో మండల వ్యాప్తంగా వయోజనులకు రాత్రి పూట విద్యను అందించడం వల్ల నిరక్షరాస్యతను రూపు మాపుటకు ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ఈ సదావకాశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని శిక్షణ పొందుతున్న విద్యా వాలంటీర్లను కోరారు. ఈ కార్యక్రమం లో సూపర్ వైజర్ శ్రీధర్, మెప్మా టి.యం.సి శ్రీనివాసరెడ్డి, మండల మహిళా సమాఖ్య రూరల్ ఏ.పి.యం అరుణ కుమారి, సి.ఓ లు చంద్ర శేఖర్, షరీఫ్, సి.సి లు నాగరాజు , రామలింగం , మీనా, రంగనాయకులు, మెప్మా ఆర్.పి లు, వి.ఓ.ఏ లు, వాలంటీర్లు పాల్గొన్నారు.










