తిరుపతి జిల్లా పాకాల మండలంలో విద్యుత్ శాఖ మీద వచ్చిన ఫిర్యాదులు మిగతా ఏ శాఖ మీద రావడం లేదని స్వయంగా చంద్రగిరి ఎమ్మెల్యేనే చెప్పారంటే ఆ శాఖ పనితీరు ఎలా ఉందో అర్థం అవుతుంది. రైతులంటే విద్యుత్ శాఖ సిబ్బంది చులకనగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. తరచూ విద్యుత్ కోతలు సమస్యలతో రైతుల విద్యుత్ స్టార్టర్లు మోటర్లు కాలిపోతున్నాయి. తరచూ విద్యుత్ కనెక్షన్ వైర్లు సబ్ స్టేషన్ లో మార్చడంతో మోటర్లు రివర్స్ పోవడం జరుగుతుంది దీనిపై సిబ్బందిని అడిగితే మీరే స్టార్టర్ లో మార్చుకోవాలని సలహాలు ఇస్తారు. వ్యవసాయ విద్యుత్తు స్టార్టర్లకు సప్లై వచ్చే వైరు తరచూ ఒక్కో పేస్ లో విద్యుత్తు సరఫరా కావడం లేదు. దీనిపై అధికారులను అడిగితే చేస్తామని సమాధానం ఇస్తారు. ఎన్ని రోజులైనా ఏ రిపేర్ వచ్చిన చేయడం లేదు. ట్రాన్స్ఫార్మర్ కాలినా, విద్యుత్ సప్లై అయ్యే వైర్లు కాలిపోయిన నెలల తరబడి పట్టించుకోరు. కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న రైతులు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. దీనిపై విద్యుత్ శాఖ అధికారులను అడిగితే సీరియల్ ప్రకారం వస్తుందని వాయిదాలు వేస్తూనే ఉన్నారు. విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్య వైఖరి అలాగే విద్యుత్ సిబ్బంది ఎలాంటి రిపేర్ చేయాలన్న లంచాలు ముట్ట చెప్పాల్సిందే. ఇంటికి వచ్చే సప్లై వైర్లు కానీ లేదా కొత్తగా కనెక్షన్లు ఇవ్వడం కానీ లేక మరమ్మత్తులు విషయంలో కానీ లంచం ఇచ్చిన త్వరగా పనులు కావడం లేదు. విద్యుత్ శాఖ సిబ్బంది అంటేనే పాకాల మండలంలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ శాఖ వినియోగదారులు కోరుతున్నారు.









