తిరుపతి : ఏపీఎస్ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన తిరుపతి రీజినల్ కమిటీ మంగళవారం తిరుపతి, ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జగదీష్ ని ఆ సంఘం యొక్క రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ వి మైకేల్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి తిరుపతి రీజినల్ నూతన కమిటీని పరిచయం చేశారు. చీఫ్ అడ్వైజర్ గా వి.ద్వారక రీజనల్ ప్రెసిడెంట్ గా బి.సురేష్ నాయక్ రీజనల్ సెక్రటరీగా పి.శ్రీనివాసులు కోశాధికారిగా బి.వెంకటేసులు వర్కింగ్ ప్రెసిడెంట్ గా డి.రమేష్ నాయక్ తో పాటు 50 మందిని వివిధ కార్యదర్శులుగా మరియు ఆఫీస్ బ్యారర్స్ గా పరిచయం చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఆర్.ఎమ్ జగదీష్ మాట్లాడుతూ జిల్లా యొక్క ప్రాముఖ్యతను తెలియపరుస్తూ తిరుపతి తిరుమల పవిత్రతను దృష్టిలో పెట్టుకొని శ్రీవారి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి మెరుగైన సేవలు అందించాలని, అందరి సమిష్టి కృషితో ఆర్టీసీని మరింత బలోపేతం చేసి ఆర్టీసీ కీర్తి ప్రతిష్టలను కాపాడాలని ప్రయాణికుల ఆదరాభిమానాలు పొందాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ వి.మైఖేల్, రీజనల్ ప్రెసిడెంట్ బి.సురేష్ నాయక్ రీజినల్ కార్యదర్శి పి.శ్రీనివాసులు చీఫ్ అడ్వైజర్ ద్వారక, గంగయ్య మరియు రీజనల్ లోని అన్ని డిపోల నాయకులు పాల్గొన్నారు.









