- జిల్లా స్థాయి కౌశల్ -2025 పోటీ పరీక్షలకు నలుగురు మొగరాల విద్యార్థులు ఎంపిక
- ప్రతిభ చూపిన మొగరాల పాఠశాల విద్యార్థులు
- ప్రతిభతో విద్యార్థుల ప్రగతి సాధ్యం
- జిల్లా స్థాయి కౌశల్ పోటీ పరీక్షలకు నలుగురు మొగరాల విద్యార్థులు ఎంపిక
పాకాల : తిరుపతి జిల్లా పాకాల మండలం ,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొగరాల విద్యార్థులు జోష్న, సమీన హప్సియా, పవన్ కుమార్ లు ఈ నెల 10 వ తేది సాయంత్రం విడుదలైన కౌశల్ సైన్స్ క్విజ్ -2025 పోటీ పరీక్షా ఫలితాల్లో విజయం సాధించి జిల్లా స్థాయి కౌశల్ పోటీ పరీక్షలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుమలత తెలియజేశారు. తదుపరి విద్యార్థులను మరియు వారిని ప్రోత్సహించి పర్యవేక్షించిన సమన్వయకర్త వనపర్తి వెంకట సిద్దులును అభినందించారు. ఈ సందర్భంగా సమన్వయకర్త వనపర్తి వెంకట సిద్దులు మాట్లాడుతూ భారతీయ విజ్ఞాన మండలి ,ఏపీ సైన్స్ సిటీ మరియు ఆఫ్ కాస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 1,2, 4 తేదీలలో ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9, 10 తరగతులు చదివే ఆసక్తి వున్న విద్యార్థులకు పాఠశాల స్థాయిలో కోడ్ తంత్ర ఆన్లైన్ సాఫ్ట్వేర్ ద్వారా కౌశల్ సైన్స్ క్విజ్ పోటీ పరీక్షలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీ పరీక్షలకు మొగరాల పాఠశాల నుండి 15 మంది విద్యార్థులు హాజరుకాగా నలుగురు విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు నవంబర్ 27 28 తేదీల్లో నిర్వహించబోయే జిల్లా స్థాయి పోటీ పరీక్షలను అదే పాఠశాలలో ఆన్లైన్లో వ్రాయవలసి ఉంటుంది. జిల్లా స్థాయి పోటీల్లో కూడా మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అవడానికి కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.









