పిడుగురాళ్ల, పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జర్నలిస్టు పై స్థానిక పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు విచారణ పేరుతో పిలిపించి, హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు సమాచారం.
జర్నలిస్ట్ తెలిపిన వివరాల ప్రకారం, తాము ప్రజల సమస్యలను, అభివృద్ధి అంశాలను మాత్రమే ప్రతిబింబించామని, రాజకీయ లాభాపహారాల కోసం కాకుండా తమ వృత్తి బాధ్యతగా పని చేశామని పేర్కొన్నారు. కానీ కొంత మంది జనసేన నాయకులు టార్గెట్ చేసి కుల సంఘాల విషయాలను రాజకీయం చేస్తూ .. పిడుగురాళ్ల సిఐ ని అడ్డంపెట్టుకుని వాట్సాప్ గ్రూప్స్ లో మెసేజ్ ఎందుకు పెట్టావని, నీ మీద కేస్ అయిందని, బెదిరింపులకు పాలుపడడం విచిత్రంగా ఉంది. రాత్రి సమయంలో ఇంటికి పోలీసులను పంపి స్టేషన్ కి రావాలని సిఐ బెదిరింపులకు పాలుపడడం, రిపోర్టర్ ఫోన్ కొందరు పోలీసులు తీసుకెళ్లడం జరిగింది. ( సంఘటన సమయం సుమారు రాత్రి 9 : 00 గంటల సమయంలో జరిగింది)
కుల సంఘాల వాట్సాప్ గ్రూప్ లో జరిగిన సంభాషణకి రాజకీయ రంగు పులిమి, ఆ విషయాన్ని పిడుగురాళ్ల సిఐ ప్రత్యేక శ్రద్ద తీసుకొని రిపోర్టర్ ని బెదిరించడం సరికాదు. రిపోర్టర్ ఏమైందని వివరణ కోరగా దురుసుగా ప్రవర్తించినట్టు పక్కా సమాచారం.
ఈ ఘటనపై మీడియా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. జర్నలిస్టులపై ఇలాంటి బెదిరింపులు ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకు విరుద్ధమని పేర్కొంటూ, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, న్యాయమైన దర్యాప్తు జరపాలని వారు డిమాండ్ చేశాయి.
ఇటువంటి విషయాలపై జిల్లా ఎస్పీ పోలీసులకు తగు సూచనలు జారీ చేయాలని మీడియా సంఘాలు కోరుతున్నాయి.
ఇకపై జర్నలిస్టుల భద్రతకు హామీ ఇవ్వాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మీడియా సంఘాలు విజ్ఞప్తి చేశాయి. అయితే, ఈ ఆరోపణలపై పిడుగురాళ్ల పోలీసులు ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.









