కురుపాంమండలం : రైతులకు మద్దతు ధర కల్పించి, దళారీ వ్యవస్థను అరికట్టే లక్ష్యంతో కురుపాం గ్రామంలో కొత్త ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, కురుపాం శాసనసభ్యురాలు శ్రీమతి తోయక జగదీశ్వరి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ, ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోకుండా ఉండేందుకు ఈ కొనుగోలు కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు పర్యవేక్షించాలని సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ సూచించారు.

ఈ కార్యక్రమానికి పలువురు స్థానిక నాయకులు, అధికారులు, రైతులు, ఏఎంసి చైర్మన్ శ్రీమతి కడ్రక కళావతి, పిఎసి చైర్మన్ కిశోర్, కురుపాం మండల కన్వీనర్ కొండయ్య,గరుగుబిల్లి మండల కన్వీనర్ నారాయణ స్వామి, జియ్యమ్మ వలస మండల కన్వీనర్ జోగి భుజంగ రావు, గుమ్మ లక్ష్మీపురం మండల కన్వీనర్ అడ్డాకుల నరేష్,నియోజకవర్గ రైతు అధ్యక్షుడు శ్రీరామ్ మూర్తి, అరకు రైతు సంఘం అధ్యక్షుడు వెంకట నాయుడు, వెంపటాపు భారతి, కోట సుమన్, డొంకడ రామ క్రిష్ణ, కోలా రంజిత్ తదితరులు పాల్గొన్నారు.










