కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సందర్భంగా గన్నేరువరం బిజెపి మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. దేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలంగాణలో కూడా రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చ జిల్లా కార్య వర్గ సభ్యులు మచ్చ బాలరాజు, మాజీ మండల వైస్ ప్రెసిడెంట్ మునిగంటి సత్తయ్య , నాయకులు పుల్లెల రాము పుల్లెల జగన్,గూడూరి జగన్, సోషల్ మీడియా కన్వీనర్ జీల కుమార్ యాదవ్,జాలి శ్రీనివాస్ రెడ్డి,బుర్ర సత్తయ్య, బుర్ర ప్రణయ్,రాజయ్య, పాల్గొన్నారు.










