కరీంనగర్ జిల్లా: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించిన సందర్భంగా గన్నేరువరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు సంవత్సరాల ప్రజాపాలనను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం మీద నమ్మకంతో ఓటు వేసిన ప్రతి ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్ మహాశయులకు ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చిట్కూరి అనంతరెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాతంగి అనిల్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాపోలు నవీన్, గన్నేరువరం గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి, నాయకులు బుర్ర తిరుపతి గౌడ్, న్యాత జీవన్, పాకాల పరశురాం,మాజీ ఎంపిటిసి తిరుపతి, శ్రీనివాస్ గౌడ్, ముస్కు తిరుపతిరెడ్డి, కందాల తిరుపతిరెడ్డి, బాలయ్య, నరసయ్య, నందికొండ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.










