కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో బోయిని సాయికుమార్ పదో తరగతి చదువుకుంటున్నాడు. ఈ నెల 11వ తేదీన క్లాసు రూమ్ లో గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నం కి పాల్పడిన విషయం తెలిసిందే..
చికిత్స తీసుకుంటున్న సాయికుమార్ ఆరోగ్యం నిలకడ గా లేక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
కుటుంబ సభ్యులకు కుమారుడు సాయికుమార్ అసలు విషయం చెప్పాడు .. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామయ్య, ఉపాధ్యాయులు శ్రీలత, అంజయ్య వేధింపులకు గడ్డి మందు తాగానని తెలిపాడు.. శుక్రవారం పోలీస్ స్టేషన్లో సాయి కుమార్ తండ్రి చంద్రయ్య ఫిర్యాదు చేశాడు.
ఈ ఘటనకు సంబంధించి ముదిరాజ్ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడు రామయ్య, ఉపాధ్యాయురాలు శ్రీలత,అంజయ్య లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు, కుల సంఘం డిమాండ్ చేస్తున్నారు..
ప్రధానోపాధ్యాయులు రామయ్య ని రిపోర్టర్ టీవీ వివరణ కోరగా 7వ తేదీ శుక్రవారం పాఠశాలకు ఒక పాము రాగ అటెండర్ ఆ పామును చంపేశాడు.. చంపిన పామును సాయి కుమార్ అనే విద్యార్థి తీసుకొచ్చి ఒక బాలిక టిఫిన్ బాక్స్ లో పెట్టాడు.. ఈ విషయంపై సాయికుమార్ తండ్రి చంద్రయ్యకు తన కుమారుతో విషయం అంత రామయ్య చెప్పించాడు.. ఆ తర్వాత పక్క ప్లాన్ తో మంగళవారం నాడు సాయికుమార్ తన వెంట తెచ్చుకున్న గడ్డి మందు తీసుకొని వచ్చి పాఠశాలలో తాగేశాడు… ఈ విషయంలో విద్యార్థి సాయికుమార్ ను ఉపాధ్యాయులు, ఎవరు కొట్టలేదని, బెదిరించలేదని ప్రధానోపాధ్యాయులు రామయ్య తెలిపారు.










