బాపట్ల జిల్లా, బాపట్ల : ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ కళాశాల బాపట్లలో ఏర్పాటు చేసిన జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) ఆధ్వర్యంలో వ్యక్తిగత మరియు సముదాయ శుభ్రత పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఈ రోజు న విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని కళాశాల అసోసియేట్ డీన్ డా మొగల్ సర్దార్ బెగ్, ఎన్ ఎస్ ఎస్ యూనిట్, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ అధికారులు అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ వినోద, డాక్టర్ గౌతమి ఇతర అధ్యాపకులు మరియు వాలంటీర్లు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కాలేజీ అసోసియేట్ డీన్ డా మొగల్ సర్దార్ బెగ్ మాట్లాడుతూ ప్రధానంగా వ్యక్తిగత శుభ్రత అనగా స్నానం, హెయిర్ కట్, దంత సంరక్షణ వంటి ప్రాథమిక అలవాట్లు, సముదాయ శుభ్రత ఎంతో ముఖ్యమో అదే విధంగా పర్యావరణ పరిరక్షణ వ్యర్థాల నిర్వహణ, చెత్త వేర్వేర వేయడం, రీసైక్లింగ్, అందరకీ శుభ్రమైన ప్రాంతాల శుభ్రత అంత కన్నా ముఖ్యమని పేర్కొన్నారు. అనారోగ్యాలను నివారించడంలో శుభ్రత యొక్క ప్రాధాన్యత, మల విసర్జన మరియు మూత్ర విసర్జన సమస్యలు పై ప్రజల అవగాహన పెరిగే విధంగా ప్రచార కార్యక్రమాలు రూపొందించడం జరిగిందన్నారు.
కళాశాల ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్, డా వినోద మాట్లాడుతూ, “వ్యక్తిగత శుభ్రత మన ఆరోగ్యానికి, సముదాయ శుభ్రత మన సమాజానికి నమ్మకం మరియు సమతుల్యతను తీసుకొస్తుంది” అని పేర్కొన్నారు. వాలంటీర విద్యార్థులు తమ ఇంటి ప్రాంగణాలను, క్లాస్‌రూమ్‌లను పరిశుభ్రంగా ఉంచడంలో భాగస్వామ్యమయ్యారు.
సమాజంలో ప్రజలకు అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో కాలేజీ క్యాంపస్ నుండి బాపట్ల క్రొత్త బస్సు స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో బి.టెక్ ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ విద్యార్థులు మరియు అధ్యాపకులు చురుకుగా పాల్గొన్నారు. కార్యక్రమం సమాప్తిలో వాలంటీర్లందరూ శుభ్రత పాటించాలనే తమ నిబద్ధతను వ్యక్తం చేశారు, మరియు భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిధిగా రాష్ట్ర త్రి దళ మాజీసైనికుల లీగ్ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస వార ప్రసాద్ చేయూతనిచ్చారు.
ఈ కార్యక్రమం ద్వారా బాపట్లలోని ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ కళాశాల విద్యార్థుల్లో పరిశుభ్రత మీద అవగాహన పెరిగడంతో పాటు, సమాజాన్ని ఆరోగ్యమయంగా తీర్చిదిద్దడంలో ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్ల ప్రాముఖ్యత మరోసారి స్పష్టం అయింది.










