మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని చేగుంట మండలం పెద్ద శివునూరు గ్రామంలో దుర్ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాదారం ఎల్లం (40), వృత్తి గ్రామపంచాయతీ సపాయి వర్కర్, మూడు సంవత్సరాల క్రితం తన ఇంటి నిర్మాణం కోసం లక్ష రూపాయల లోన్ తీసుకున్నాడు. అప్పటి నుంచి కుటుంబ ఆర్థిక పరిస్థితులు క్రమంగా క్షీణించాయి.
మూడు నెలల క్రితం అతను బైక్‌పై నుంచి పడిపోవడంతో ఎడమ చేయి భుజం విరిగింది. దీని వల్ల చికిత్స ఖర్చులు పెరగడంతో అప్పులు మరింత భారమయ్యాయి. అప్పుల ఒత్తిడి, చికిత్స వ్యయాలు తీర్చలేక మనస్తాపానికి గురైన ఎల్లం, కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక పోలీస్ వారు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.









