పార్వతీపురం మన్యం జిల్లా: జియ్యమ్మ వలస మండలం, పెదబుడ్డిడి గ్రామ వీఆర్ఓ భూసి తిరుపతిరావు అనేక అక్రమాలు, అవినీతికి పాల్పడినట్లు బాధితులు సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు దృష్టికి తీసుకొచ్చారు. కొల్లి గంగు నాయుడు మాట్లాడుతూ గుమ్మడి గౌరమ్మ అనే బాధితురాలి భూమి మ్యుటేషన్ కోసం రూ. 20,000 డిమాండ్ చేసి, రూ. 5,000 లంచం తీసుకున్నారని. పని కాకపోవడంతో కలెక్టరేట్లో ఫిర్యాదు చేయగా డబ్బు తిరిగి ఇచ్చి, ఆమెకు చెందిన 20 సెంట్ల భూమిని ఇతరులకు ఆన్లైన్ చేశారని ఆరోపించారు. రెడ్డి తవిటి నాయుడు కుమారుడి పిల్లలను రేషన్ కార్డులో చేర్చడానికి రూ. 1,000 లంచం తీసుకున్నారుని. ఇద్దరు మహిళల రేషన్ కార్డులు రద్దు చేస్తానని, పెన్షన్లు నిలిపివేస్తానని భయపెట్టి రాత్రి 7 గంటల వరకు సచివాలయంలో ఉంచారుని. పట్టాదారు పాస్ పుస్తకాలు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు సహా పలు సర్వీసులకు డబ్బులు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు అని అన్నారు. వీఆర్ఓ భూసి తిరుపతిరావుపై సమగ్ర దర్యాప్తు జరిపి, అక్రమాలు రుజువైతే చర్యలు తీసుకోవాలని గంగు నాయుడు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాధితులను వెంటబెట్టుకుని కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కూరంగి సీతారాం పాల్గొన్నారు.









