వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈనెల 30. ఆదివారం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని బీసీ కాలనీ నందు మండల మహాసభలు నిర్వహించడం జరుగుతుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, మండల కార్యదర్శి. ఎం మల్లేష్, అధ్యక్షుడు చందు తెలిపారు. బుధవారం స్థానిక పట్టణంలోని బీసీ కాలనీలో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ మహాసభలు ముఖ్య ఉద్దేశం వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా గుత్తి మండలంలోని బేతాపల్లిలో సోలార్ ప్రాజెక్టుపై మరియు ఉపాధి హామీ పథకంపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. కావున మండలంలోని పెద్ద ఎత్తున వ్యవసాయ కూలీలు, ప్రజలు పాల్గొని ఈ మహాసభలను జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు









