అనంతపురం జిల్లా గుత్తి పట్టణం 17వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ షేక్ పర్వీన్ ఇటీవల మోకాలు సస్త్ర చికిత్స చేయించుకుని చికిత్స అనంతరం ఇంటిపట్టున ఉంటున్న విషయమును తెలుసుకున్న గుంతకల్లు నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం తనయుడు యువనేత టిడిపి గుత్తి మరియు పామిడి మండలాల బాధ్యులు గుమ్మనూరుఈశ్వర్ ఆమె నివాసమునకు వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటామంటూ తెలిపారు. అలాగే షేక్ పర్వీన్ త్వరగా కోలుకొని ప్రత్యక్ష రాజకీయాల్లో తిరగాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గుత్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ జక్కలచెరువు ప్రతాప్, జక్కలచెరువు ఎంపీటీసీ సభ్యుడు నారాయణస్వామి, ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు చికెన్ శీనా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.









