అనంతపురం జిల్లా గుత్తి పట్టణం అనంతపురం రోడ్డులో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కు ముఖ్య అతిథిగా పాల్గొన్న గుంతకల్లు నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి శుక్రవారం ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఫిర్యాదుల పరిష్కార దిశగా ప్రవేశపెట్టడం సమ సమాజ పరిపాలనకు నిదర్శనం అన్నారు.ప్రధాన అనంతరం ఎమ్మెల్యే దృష్టికి వచ్చిన గ్రీవెన్స్ మరియు ప్రజాదర్బార్ లో వచ్చినటువంటి ప్రజల ఫిర్యాదులను పరిష్కరించుటకై సంబంధిత అధికారులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామారావు, తహసిల్దార్ పుణ్యవతి, మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, సంబంధిత అధికారులు టిడిపి నాయకులు జక్కలచెరువు ఎంపీటీసీ నారాయణస్వామి, వ్యవసాయ మార్కెట్ యార్డ చైర్మన్ జక్కల చెరువు ప్రతాప్, ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు చికెన్ శ్రీనివాసులు, బద్రి వలి, మండల వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









