contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణానను తక్షణమే నిలిపివేయాలి

  • మెదక్ నుండి హైదరాబాద్ కు టిప్పర్ల ద్వారా తరలిస్తున్న ఇసుక రవాణా పై చర్యలు తీసుకోవాలి
  • లేనిచో బిఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తాం
  • మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ కు ఫిర్యాదు చేసిన మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం.పద్మ దేవేందర్ రెడ్డి

 

మెదక్ తూప్రాన్ : మెదక్ నియోజవర్గంలో వివిధ ప్రాంతాల నుండి మరియు మెదక్ మండలం సంగాయిగూడ తండా హల్దీ వాగు నుండి గత నెల రోజులుగా రాత్రిపగలు హిటాచి సహాయంతో టిప్పర్ల ద్వారా హైదరాబాదు, జహీరాబాద్,బీదర్ నగరాలకు ఇసుక అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు,వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని శుక్రవారం మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం.పద్మ దేవేందర్ రెడ్డి , మెదక్ పట్టణ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ రాజ్ కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ…అధికార పార్టీ నాయకుల అండదండలతో మెదక్ ప్రాంతం నుండి హైదరాబాద్, జహీరాబాద్ బీదర్ నగరాలకు సంగాయిగూడ తండా హల్దీ వాగు నుండి హిటాచి సహాయంతో గత నెల రోజులగా టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని అన్నారు. పోలీసులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు అని ప్రశ్నిచారు. ప్రతిపక్ష నాయకుల పైన కేసులు పెట్టడం కేసులు పెట్టడం భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కానీ ఈ అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై పోలీసులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు దొరకని ఇసుక అక్రమంగా హైదరాబాద్కు ఎలా తరలిస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే అక్రమంగా ఇసుక దందా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి, లేనిచో బిఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. పోలీసులు శుక్రవారం పాత ఎస్పీ కార్యాలయం దగ్గర వెహికిలు చెకింగ్ నిర్వహించారు, సాధారణ ప్రయాణికుల కార్ లు , ద్విచక్ర వాహనాలు ఆపారు కానీ ఇసుక తరలిస్తున్న టిప్పర్లను మాత్రమే ఆపలేరని అన్నారు. మెదక్ నుండి ఇలా అక్రమంగా ఇసుక తరలిపోతే మెదక్ ప్రాంత ప్రజలకు తీవ్రత నష్టం జరుగుతుందని అన్నారు. ఈ విషయంలో వెంటనే మెదక్ ఎస్పీ కలెక్టర్ రాహుల్ రాజ్ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనిచో బిఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు విశ్వం, భీమరి.కిషోర్ ఆర్కే.శ్రీనివాస్, మాయ.మల్లేశం, మెదక్ మండల మాజీ వైస్ ఎంపీపీ మార్గం. ఆంజనేయులు, నాయకులు కొత్తపల్లి కిష్టయ్య,గట్టయ్య, యాదగిరి, లింగా రెడ్డి, ప్రభాకర్, జుబెర్ అహ్మద్, మేకల సాయిలు,యామి రెడ్డి, సాప, సాయిలు స్వామి నాయక్ రంజిత్ లడ్డు చంద్ పాషా తదితరులు ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :