బాపట్ల: డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బాపట్లకు చెందిన బి.టెక్ ఫుడ్ టెక్నాలజీ మొదటి సంవత్సరం (ఫ్రెషర్స్) విద్యార్థులు దీక్షారంభ కార్యక్రమం సందర్భంగా సూర్యలంక బీచ్‌ను సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) ఆధ్వర్యంలో బీచ్ శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.
విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు డా. ఈ. గౌతమి, అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలిపారు. బీచ్‌లో ఉన్న చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరిపారేసి శుభ్రతపై ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలిపినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని డా. ఈ. గౌతమి, అసిస్టెంట్ ప్రొఫెసర్, శ్రీ ఎం.ఎల్. లావణ్య, టీచింగ్ అసిస్టెంట్ మరియు డా. వై. దిలీప్సేన్, టీచింగ్ అసోసియేట్ సమన్వయం చేశారు. అధ్యాపకులు విద్యార్థులతో కలిసి బీచ్ శుభ్రతలో చురుకుగా పాల్గొన్నారు.









