పార్వతీపురం మన్యం జిల్లా/జియ్యమ్మవలస : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జియ్యమ్మవలస మండల కేంద్రంలో శ్రీ సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో శనివారం పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వ్యాసరచన పోటీలు: విద్యార్థులలో నైతిక విలువలు, సేవా భావం, దైవ చింతన పెంపొందించే లక్ష్యంతో ‘డ్యూటీ ఈజ్ గాడ్’ (పనియే దైవం) అనే అంశంపై ప్రత్యేక వ్యాసరచన పోటీలను నిర్వహించారు.ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమ విద్యార్థులను అభినందిస్తూ, విజేతలకు భజన మండలి సభ్యులు బహుమతులు, మిఠాయిలు (స్వీట్స్) అందజేశారు. విద్యార్థులు ఉన్నత విద్యావంతులుగా రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం సేవా దృక్పథంలో భాగంగా, రావాడ రాంభద్రాపురం లోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పాఠశాల అవసరాల నిమిత్తం 3 టార్చ్ లైట్లను భజన మండలి తరపున ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి భజన మండలి కన్వీనర్, మండలి సభ్యులు, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.









