పార్వతీపురం మన్యం జిల్లా ఆధ్యాత్మిక కేంద్రంగా, భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుతున్న కురుపాం నియోజకవర్గంలోని తోటపల్లి శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి, కోదండ రామస్వామి దేవస్థానం నందు ఆదివారం ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఆలయ నూతన ధర్మకర్తల మండలి (ట్రస్ట్ బోర్డు) ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా, వేద మంత్రోచ్ఛారణల నడుమ జరిగింది. కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి ఆశీస్సులతో నియమితులైన ఈ నూతన పాలకవర్గం దైవసాక్షిగా బాధ్యతలు స్వీకరించింది. దేవస్థానం నూతన చైర్మన్గా మార్కొండ ఫకీరు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పాలకమండలి సభ్యులుగా (డైరెక్టర్లు),రెడ్డి రాజేశ్వరి,
సంభంగి ఫకీరు నాయుడు, గరుగుబిల్లి మీనా, వావిలపల్లి పద్మజ,ముచ్చకర్ల నారాయణ రావు,అరిక జానకి, బొమ్మలి సుభాషిణి,భగవాన్ వర ప్రసాద్ మిశ్రో,సృష్ఠి లక్ష్మీ,మరడాన కృష్ణమూర్తి నాయుడు,వర్ధుల వెంకట అప్పల ఆచార్య ప్రమాణస్వీకారం చేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సభ్యులు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. గరుగుబిల్లి మండల కన్వీనర్ నారాయణ స్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని, ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ‘జట్టు’ వ్యవస్థాపకులు మరియు ఆలయ ట్రస్టీ డోళ్లు పారి నాయుడు తనదైన శైలిలో సమన్వయం చేస్తూ సభా కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించారు.
ఈ వేడుకలో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా డైరెక్టర్లు శేఖర్ పాత్రుడు లావణ్య, అక్కినే మధు, అంబటి రాంబాబు, తోటపల్లి సర్పంచ్, ఏఎంసి చైర్మన్ శ్రీ కడ్రక కళావతి, వెంపటాపు భారతి, కోలా రంజిత్, విజయంకుసం, వెంకట నాయుడు, శ్రీరామూర్తి, పురుషోత్తం, కృష్ణ బాబు, ధూళి కేశవరావు, నంగిరెడ్డి మధు, డొంకడ రామక్రిష్ణ, జియ్యమ్మ తావిటి నాయుడు, గరుగుబిల్లి ఎంపీపీ తదితరులు హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కురుపాం నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలకు చెందిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ (కూటమి) మండల కన్వీనర్లు, రాష్ట్ర మరియు పార్లమెంట్ స్థాయి వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.








