తూప్రాన్ డివిజన్ : ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ బ్యాంకుల రుణ వేధింపులు మరో కుటుంబాన్ని కుంగదీసిన ఘటన తూప్రాన్‌లో చోటుచేసుకుంది. ఒత్తిడిని తట్టుకోలేక ఓ వివాహిత మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.
తూప్రాన్‌కు చెందిన ఎండ్రెల్లి వరలక్ష్మి (35) ని క్రిష్ బ్యాంక్ సిబ్బంది ఇంటికి వెళ్లి రుణ బాకీ చెల్లించాలని మానసికంగా హింసించినట్లు తెలుస్తోంది. మొత్తం ₹70,000 రుణం తీసుకున్నారు. ఇప్పటికే క్రమంగా కిస్తీలు చెల్లించినప్పటికీ, ఇంకా ₹20,000 మాత్రమే బాకీ ఉన్నట్లు సమాచారం. బాకీ చెల్లించాలని రోజూ వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురైన మహిళా ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికుల సమాచారం.
ఈ విధంగా వేధింపులకు గురిచేస్తున్న బ్యాంకుల వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు స్పందిస్తారా లేదా వేచి చూడాలి. పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.








